హోళగుందలో ఎస్‌ఎఫ్‌ఐ నూతన మండల కమిటీ ఎన్నిక
1 min read

హోళగుంద న్యూస్ నేడు: విద్యార్థుల సమస్యల పరిష్కారం ప్రభుత్వ విద్యా పరిరక్షణ కోసం ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరం పోరాటం చేస్తుందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, మాజీ నాయకుడు నాగరాజు పేర్కొన్నారు. హోలుగుంద మండలంలో నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ మండల జనరల్ బాడీ సమావేశంలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యా, వసతి, ఉపాధి సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ఎస్‌ఎఫ్‌ఐ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే ఉద్యమాలు చేపట్టేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.సమావేశంలో 16 మంది సభ్యులతో కూడిన నూతన మండల కమిటీని ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షుడిగా మల్లయ్య, మండల కార్యదర్శిగా ఉచ్చిరప్ప, మండల ఉపాధ్యక్షులుగా ప్రకాష్, ఆనంద్, యశ్వంత్, మండల సహాయ కార్యదర్శులుగా గాదలింగప్ప, అనిల్ కుమార్ ఎన్నికయ్యారు. అలాగే కమిటీ సభ్యులుగా మరో 11 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నాయకులు వెల్లడించారు.నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా కమిటీల పిలుపు మేరకు మండలంలోని విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ముఖ్యంగా సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యల పరిష్కారం, ఆదోని ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. స్థానిక విద్యారంగ సమస్యల పరిష్కారానికి విద్యార్థులను ఐక్యం చేసి పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శివ, నరసింహ, సంజయ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


