NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కౌతాళం నుండి మెలిగనూరు వరకు భారీ జన సంద్రోహం మధ్య తిక్కా రెడ్డి పర్యటన

1 min read

కౌతాళం న్యూస్ నేడు: మేలిగనూరు గ్రామంలో స్వయంభువుగా వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ పాలకుర్తి తిక్కా రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన తిక్కా రెడ్డికి అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు.శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానంతరం పాల్తూరు తాతగా భక్తులచే పిలవబడే శ్రీ శ్రీ శ్రీ చెన్న వీర శివాచార్యుల స్వామివారిని తిక్కా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామివారికి పూలమాల వేసి, శాలువాతో సత్కరించి నమస్కరించారు.శ్రీ చెన్న వీర శివాచార్యుల స్వామివారు తిక్కా రెడ్డి ఆశీర్వదిస్తూ, ప్రజాసేవలో నిమగ్నమై ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉరుకుంద ఈరన్న మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్లు చెన్న బసప్ప మరియు బాపూరం  శివ మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రాజు  సతీష్ చౌదరి  రమేష్ గౌడ్, ఉరుకుంద కొట్రేష్ గౌడ్  కాశీ విశ్వనాథ్   కుంటనహాళ్ దొడ్డన్న గౌడ్  కొరుగోడప్ప, రవి ,కోసిగి భరద్వాజ్ ,శెట్టి దుబ్బిరెడ్డి కొండగైని వీరారెడ్డి సాత్నూర్  వడ్డే మంజునాథ్ ఉల్లిగయ్య ఎరిగేరి శేఖర్  కౌతాళం మండలం సెక్రెటరీ నాగిరెడ్డి సులేకేరి  హనుమంత రెడ్డి శివరాం రెడ్డి చిన్న హనుమంతు కావలి వీరప్ప శివప్ప గౌడ్ కుంభలూరు  సర్పంచ్ వీరేష్ ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు,  పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *