NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లింగపాలెంలో మద్యం షాపులు తనిఖీ చేసిన చింతలపూడి ఎక్సైజ్ శాఖ అధికారులు

1 min read

పలు మద్యం దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు

సురక్ష యాప్ ద్వారా మద్యం అమ్మకాలు జరపాలని సిభందికి సూచనలు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ లాఎక్సైజ్, ఏలూరు బి.శ్రీలత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ (ఎన్ఫోర్స్మెంట్), ఏలూరు కె.వి.ఎన్. ప్రభు కుమార్ మరియు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి, ఏలూరు జిల్లా ఏ.ఆవులయ్య ఆదేశాల ప్రకారం చింతలపూడి ఎక్సైజ్ సి.ఐ.పి.అశోక్ ఆదేశాలతో.ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు సిబ్బంది లింగపాలెం మండలం వెస్ట్ యడవల్లి గ్రామంలో ఎక్సైజ్ నేరల అదుపు కొరకు దాడులు నిర్వహించరు.నాయుడు సీత అను మహిళ వద్ద (01) లీటర్ నాటు సారాయి పట్టుబడగా ఆ మహిళ పై కేసు నమోదు చేసి కోర్టు ఆదేశాల పై రిమాండ్ కుతరలించారు. అలాగే  లింగపాలెం మండలంలో గల పలు మద్యం దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సురక్ష యాప్ ద్వారా మద్యం అమ్మకాలు జరపాలని సిభంది కి తగు సూచనలు జారీ చేశారు.  చింతలపూడి మండలం కంచన గూడెం గ్రామానికి చెందిన పాత నాటు సారాయి ముద్దాయి బోయన సిద్దు అను వ్యక్తిని చింతలపూడి మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వారి వద్ద హాజరు పరచగా 129 బిఎన్ఎస్ఎస్ చట్ట ప్రకారం బైండ్ ఓవర్ బాండ్ విధించారు.ఈ కార్యక్రమాలలో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ ఎస్.ఐ. అబ్దుల్ ఖలీల్ మరియు సిబ్బంది పాల్గొన్నరు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *