ధర్మబద్దమైన ప్రవర్తన తోనే సమాజంలో నిజమైన శాంతి, సామరస్యం
1 min read

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తి.తి.దే.
నందికొట్కూరు నందు ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు
నందికొట్కూరు, న్యూస్ నేడు: ధర్మమే మానవులను స్థిర మతులుగా, హిత మతులుగా, మహిత మతులుగా తీర్చిదిద్దుతుందని, అటువంటి ధర్మాన్ని మన ఋషులు మనకు ఎనలేని సంపదగా అందించారని, ఈనాటి సమాజం జ్ఞానులైన పెద్దల నుండి ధర్మ మార్గాన్ని అలవరచుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణం, మారుతీనగర్ లోని శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంనందు నాలుగు రోజుల కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. మొదటిరోజు ప్రభుత్వ ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ చిన్నావుల వేంకట రాజారెడ్డి శ్రీమద్రామాయణం – ఆదర్శజీవనం అన్న అంశంపై సుదీర్ఘంగా ప్రవచించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడంపట్ల శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ కౌన్సిలర్ జి.భాస్కర రెడ్డి, సాయిరాం విద్యాసంస్థల అధినేత పల్లా సుధాకర్ రెడ్డి, హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు జూలకంటి రవితేజశర్మ, సాయిరాం కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, తి.తి.దే. ధర్మ ప్రచార మండలి సభ్యులు అంబటి శివశంకరరెడ్డి, ఎల్. రామలక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.



