బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ హరిత
1 min read

జఫురుల్లా సీఐగా,కృపావర కుమారీ ఎస్ఐగా పదోన్నతి సన్మానించిన ఎమ్మెల్యే..
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖలో నూతన ఎస్సైగా ఎం హరిత మంగళవారం ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈమె బనగానపల్లెలో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తూ పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు.నందికొట్కూరులో ఎక్సైజ్ ఎస్ఐ జఫురుల్లా మరియు హెడ్ కానిస్టేబుల్ కృపావర కుమారి పదోన్నతులు పొందారు.ఎస్ఐ జఫురుల్లా సీఐగా పదోన్నతి కల్పించి డోన్ సీఐగా నియమించారు. అదేవిధంగా ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న కృపావర కుమారికి ఎస్సైగా పదోన్నతి కల్పించి కోడుమూరు ఎస్సైగా నియమించారు.
పదోన్నతులు పొందిన వారిని సత్కరించిన ఎమ్మెల్యే
సీఐ రామాంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పదోన్నతులు పొందిన జఫురుల్లా,కృపావర కుమారీ లను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మరియు సీఐ,సిబ్బంది శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ విధులను బాధ్యతాయుతంగా సమర్థవంతంగా పనిచేస్తూ శాఖకు మంచి పేరు తీసుకురావాలని వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ, తహసిల్దార్ శ్రీనివాసులు, సిబ్బంది పద్మనాభం,శేఖరయ్య,శివన్న, సుధాకర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



