NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతులకు భారంగా బీమా ప్రీమియం…

1 min read

పంటల బీమా ప్రభుత్వమే చెల్లించాలి… సిపిఎం 

న్యూస్ నేడు, పత్తికొండ  : వర్ష బావ పరిస్థితులు, గత కొన్ని ఏళ్లు గా వ్యవసాయానికి తీవ్ర ఆటంకాలు ఏర్పడుతూ, ప్రకృతి విపత్తుతో తీవ్రంగా నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఉచితంగా పంటల బీమా చెల్లించాలని సిపిఎం జిల్లా నాయకులు బి. వీర శేఖర్ డిమాండ్ చేశారు.మంగళవారం నాడు మండల కేంద్రం దేవనకొండ లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆంధ్ర గ్రామీణ బ్యాంక్ ముందు మరియు స్థానిక వ్యవసాయ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఆ పార్టీ మండల కమిటీ సభ్యులు అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వీరశేఖర్ మాట్లాడుతూ, వ్యవసాయం భారం అవుతున్న నేటి పరిస్థితుల్లో రైతుల సహనానికి పరీక్ష పెట్టినట్లు ప్రభుత్వాలు రైతులపై విరివిగా భారాలేస్తూ రైతును కృంగ దీస్తున్నాయని వాటికి ఉదాహరణ భారీగా పంటల బీమా ప్రీమియం చెల్లించాలని కోరడమేనని పేర్కొన్నారు అసలే అప్పుల బాధతో ప్రకృతి సహకరించక పాలకుల విధానాల వలన  నష్టపోతున్న రైతుకు ప్రభుత్వాలు  పంటల బీమా ప్రీమియం  పేరుతో వారిని తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని పేర్కొన్నారు ఎరువులు ,విత్తనాలు, పురుగుమందుల ధరలు  పెరగడం ఈ సంవత్సరం వ్యవసాయానికి మరింత భారంగా మారిందని గత సంవత్సరం గిట్టుబాటు ధర లేకపోవడం వర్షాభావ పరిస్థితులు అతివృష్టి పరిస్థితి రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీసేయని ఇప్పుడు రైతులే ప్రీమియం చెల్లించాలంటే భారీగా పెంచిన ప్రీమియం ధరలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారని వారు పేర్కొన్నారు ప్రభుత్వమే రైతులకు ఉచితంగా ప్రీమియం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాండురంగడు మహేంద్ర వివిధ గ్రామాల రైతులు ఆంజనేయులు నరసన్న మాదన్న నాగరాజు రామాంజనేయులు బడేసా రామయ్య శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *