అంత్యోదయ అన్నా యోజన పథకం కుదించే యువజనను మానుకోవాలి
1 min read

సిపిఎం మండల కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి
న్యూస్ నేడు,పత్తికొండ : కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఆకలి తీర్చడానికి వామపక్షాల ఒత్తిడితో ప్రవేశపెట్టిన అంత్యోదయ అన్నయోజన పథకాన్ని బిజెపి కేంద్ర ప్రభుత్వం కుదించాలని చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సీనియర్ నాయకులు రంగారెడ్డి సూచించారు. ఈ మేరకు పత్తికొండలో మంగళవారం గుత్తి సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి దస్తగిరి అధ్యక్షుడు వహించగా వెంకటేశ్వర రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు అన్నం పెట్టేటటువంటి పథకాన్ని కుదించడానికి అదేవిధంగా మహిళలకు ఉజ్వల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటటువంటి పథకాన్ని రద్దు చేయడానికి రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రవిచంద్ర కాశన్న శివశంకర్ గోపాల్ బుజులు, నరసన్న రాజుల కారప్ప సురేంద్ర మధు తదితరులు పాల్గొన్నారు.


