గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలి
1 min read

ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎన్. కృష్ణయ్య డిమాండ్
న్యూస్ నేడు, పత్తికొండ: గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం, ఊరి పరిశుభ్రత కోసం పగలు, రాత్రి శ్రమిస్తున్న పంచాయతీ కార్మికుల పట్ల అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం అత్యంత విచారకరమని, వారు చాలిచాలని వేతనాలతో వారి కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నారని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఇన్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక చదువులు రామయ్య భవన్లో పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.పంచాయతీ కార్మికుల వేతనాలు ఒకే విడతలో చెల్లించాలని, ప్రతి నెల 5వ తేదీ లోపు జీతాలు అందేలా శాశ్వత జీవో తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించి మురికికూపాల్లో పనిచేసే కార్మికులకు కనీస రక్షణ పరికరాలైన మాస్కులు, చేతి గ్లోవ్స్, గమ్ బూట్లు ఇవ్వాలని తెలిపారు.కార్మికుల భద్రతకు గ్యారెంటీ లేదని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను సక్రమంగా అమలు చేసి వారి ఆరోగ్యానికి భరోసా కల్పించాలని కోరారు.గ్రామపంచాయతీ అధికారులు ఇప్పటికైనా స్పందించి కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పత్తికొండ గ్రామపంచాయతీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.అనంతరం గ్రామపంచాయతీ కార్యదర్శి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి యు కారుమంచి ఏఐటీయూసీ తాలూకా అధ్యక్ష , కార్యదర్శి జి.నెట్టికంఠయ్య హెచ్.రంగన్న ఏఐటియుసి తాలూకా గౌరవ అధ్యక్షులు బి.మాదన్న ఏఐటీయూసీ తాలూకా ఉపాధ్యక్షులు గుండు బాషా, రాజప్ప గ్రామపంచాయతీ కార్మికులు అంజి , నరసింహ, పెద్ద వీరన్న రామచంద్ర రంగస్వామి , తదితరులు పాల్గొన్నారు.


