NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గోసేవయే గోవిందుడి సేవ – గోరక్షణయే ధర్మ రక్షణ

1 min read

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తి.తి.దే.

ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు.

కర్నూలు, న్యూస్​ నేడు:  భారతీయ సంస్కృతిలో గోమాతకు విశిష్ట స్థానం ఉన్నదని, గోవును ఒకసాధారణ జంతువులాగా చూడడం మానవీయ దృష్టిఅని, భూమిపై నడయాడే ఒక అపురూప జీవి అనుకోవడం భారతీయమైన ఆలోచన అని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణం, మారుతీనగర్ లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంనందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం సామూహిక గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. వేదపండితులు జూలకంటి రవితేజ శర్మ ఆధ్వర్యంలో వేదోక్తంగా నిర్వహించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ చిన్నావుల వేంకట రాజారెడ్డి మూడు రోజులుపాటు శ్రీమద్రామాయణం, మహాభారతం, శ్రీ వేంకటాచల మహత్య్మంపై చేసిన ప్రవచనాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడంపట్ల శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ కౌన్సిలర్ జి.భాస్కర రెడ్డి, సాయిరాం విద్యాసంస్థల అధినేత పల్లా సుధాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తి.తి.దే. ధర్మ ప్రచార మండలి సభ్యులు అంబటి శివశంకర రెడ్డి, సాయిరాం కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, స్కాలర్స్ ఇ. మీ. ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ కాళ్ళూరి శ్రీలక్ష్మి, ఎల్. రామలక్ష్మయ్య, రామానాయుడుతోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *