NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లపై ముమ్మర సమీక్ష

1 min read

ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో స్థల పరిశీలన, ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండల కేంద్రంలో ఈ నెల 25న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు వేగవంతంగా కొనసాగుతున్నాయి. పర్యటనను విజయవంతం చేయడమే లక్ష్యంగా ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి  వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో సభా ప్రాంగణం, వేదిక, ప్రజల రాకపోకలు, వాహనాల పార్కింగ్, తాగునీరు, విద్యుత్, భద్రత, ఇతర మౌలిక సదుపాయాలపై సమగ్ర స్థల పరిశీలన నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని నాయకులు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆలూరు టీడీపీ మాజీ ఇన్‌చార్జి వైకుంఠం శివప్రసాద్, హొళగుంద మండల పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమం విజయవంతం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి పర్యటనను ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి కీలక సందర్భంగా భావిస్తూ, ప్రజల భాగస్వామ్యంతో ఘన విజయవంతం చేయడానికి అన్ని స్థాయిల్లో సన్నాహాలు కొనసాగుతున్నాయని నాయకులు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *