క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో ఈ నెల 10న జైలు బరో
1 min read
కరపత్రాలు పంపిణీ చేస్తున్న సిపిఎం పార్టీ నాయకులు
న్యూస్ నేడు, పత్తికొండ: క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో ఈనెల 10వ తారీఖున జైలు భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిపిఎం పార్టీ నాయకులు తెలిపారు. శనివారం పత్తికొండ పట్టణంలో జైలు భరో కరపత్రాలను సిఐటియు మండల కార్యదర్శి ఎo.రవిచంద్ర ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఢిల్లీలో జూలై 28, 29 తేదీల్లో జరిగిన సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల జాతీయ సదస్సు లో నేడు కార్మికులు రైతాంగం సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆగస్టు 10 నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పిలుపులో భాగంగా పత్తికొండలో కూడా పదో తారీఖున జైలు బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. జూలై నెలలో మోడీ ప్రభుత్వానికి ముక్కుతాడు వేసిన విద్యార్థి యువత ఉద్యమం మనకు స్ఫూర్తిదాయకంగా కావాలని ఆయన ఆకాంక్షించారు. అందులో భాగంగా అన్ని కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ఐక్యతతో ఈ జైలు బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జైల్ బరో కార్యక్రమంలో అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 31 వేలు ఇవ్వాలని, అంగన్వాడీలు, ఆశ, మిడ్ డే వివో ఏలు, సమగ్ర శిక్ష ఎన్.హెచ్.ఎం తదితర స్కీం వర్కర్లకు కనీస వేతనం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కౌలు రైతులకు పంట రుణమాఫీ చేయాలని కోరారు. హంద్రీనీవా కాలవ ద్వారా పత్తికొండ మండలంలో ఉన్న ప్రతి ఎకరాకి పిల్ల కాలువలు ద్వారా నీళ్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పత్తికొండ పట్టణానికి ఎంతో అవసరమైన రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని త్వరితగతిన చేపట్టాలని సూచించారు.


