NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పత్తికొండ మేజర్ గ్రామపంచాయతీ వైఎస్ఆర్  పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా సోమశేఖర్ ఎంపిక

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ:  పత్తికొండ మేజర్ గ్రామపంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్ సోమశేఖర్‌ను మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ  , రాష్ట్ర ఎస్‌ఈసీ సభ్యులు రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ శనివారం ఎంపిక చేశారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పత్తికొండ పట్టణంలో క్రియాశీలకంగా పనిచేస్తూ, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న సోమశేఖర్‌కు సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం కల్పించినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త సమష్టిగా కృషి చేసి పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని, ఐకమత్యంతో ముందుకు సాగుతూ పత్తికొండ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని వారు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *