NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డీఎస్సీ అక్రమాలపై  విచారణకు ఎందుకు భయ పడుతున్నారు ?

1 min read

మంత్రి పదవికి రాజీనామా చేసి సీబీఐ విచారణ కు సహక రించాలి

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

మూడవ రోజు రిలే దీక్షలకు పెద్దిరెడ్డి, ఆకేపాటి సంఘీభావం

మదనపల్లె, న్యూస్ నేడు ప్రతినిధి : డీఎస్సీ–2025 నియామక ప్రక్రియ లో స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణల పై సీబీఐతో సమగ్ర,  విచారణ జరిపించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మదనపల్లెలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజు కొన సాగించారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట కొనసాగు తున్న దీక్షలకు మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అన్నమయ్య జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమర నాథరెడ్డి, తంబళ్ళ పల్లె శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారక నాథరెడ్డి లు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై ఆరోపణలు ఎదురవుతున్న ప్పుడు విచారణకు ఆదేశించడం ప్రభుత్వ బాధ్యత అని, విచారణకు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.నీట్ పరీక్షల నిర్వహణపై పరోక్షంగా బాధ్యత వహించాల్సి వచ్చిన సందర్భంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, డీఎస్సీ–2025పై రాష్ట్రంలో  తీవ్ర ఆరోపణలు,  వ్యక్త మవుతున్నప్పటికీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు బాధ్యత వహించడం లేదని ప్రశ్నించారు.స్పోర్ట్స్ కోటా ఎంపికలపై అభ్యర్థులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వం  పార దర్శకంగా వ్యవహరించింటే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడు తొందని నిలదీశారు.అన్నమయ్య జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీపై వస్తున్న ఆరోపణలను ప్రభుత్వం తేలిగ్గా తీసుకోవడం సమంజసం కాదని,  నిరుద్యోగ యువత జీవితాలు, వారి కుటుంబాల భవిష్యత్తు ఉపాధ్యాయ నియామకాలతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. మదనపల్లె నియోజకవర్గ  సమన్వయకర్త ఎస్. నిసార్ అహమద్ మాట్లాడుతూ ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీల ను అమలు చేయ కుండా ప్రజలను మభ్యపెట్టేందుకు కూటమి ప్రభుత్వం కొత్త కార్యక్రమాలకు తెరలేపడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం కోసం సుదీర్ఘ కాలం పాటు కష్టపడ్డ అభ్యర్థులకు  అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ రిలే దీక్షల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన, విద్యార్థి విభాగాల ప్రతి నిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author