వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
1 min read
ఎక్కడ చూసినా సిద్దార్థ.. సుధీర్ జెండాలే
నందికొట్కూరు న్యూస్ నేడు: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలుకు వస్తున్న సందర్భంగా జగన్ ను చూసేందుకు వెళ్తుండగా నందికొట్కూరులో వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి కర్నూలు సబ్ జైల్లో ఉండడంతో ఎమ్మెల్యేను (ములాకత్) పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ ప్రమర్శించారు.
నంద్యాల జిల్లా నందికొట్కూరు నేషనల్ హైవే రోడ్డు దగ్గర
రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి..నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ మరియు నాయకులను కర్నూలుకు వెళ్లకూడదంటూ నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం మరియు పోలీసులు ఆంక్షలు విధించారు.మేము జగన్ ను చూడడానికి వెళ్తుంటే మీరెందుకు మమ్మల్ని ఆపుతున్నారంటూ సిద్ధార్థ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కసేపు ఆపిన తర్వాత రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం వారిని పంపించేశారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల,జూపాడుబంగ్లా మిడుతూరు మండలాల నుండి వివిధ గ్రామాల కార్యకర్తలు నాయకులను వెళ్ళనీయకుండా రోడ్ల దగ్గర పోలీసులు అడ్డుకున్నారు.
ఎక్కడ చూసినా సిద్ధార్థ, సుధీర్ జెండాలే
కర్నూల్ కు వస్తున్న జగన్ ను చూసేందుకు నందికొట్కూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి బైకులు ఆటోలు కార్లకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మరియు డాక్టర్ ధారా సుధీర్ జెండాలను కట్టుకొని హంగామా చేసుకుంటూ భారీగా తరలి వెళ్లారు.అంతేకాదు నన్నూరు టోల్ ప్లాజా దగ్గర మాజీ సీఎం జగన్ రోడ్డు వెంట కాన్వాయ్ లో వెళ్తుండగా ఆ కాన్వాయ్ చుట్టుపక్కల అంతా కూడా సిద్ధార్థ రెడ్డి,సుధీర్ జెండాలే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ కళకళలాడాయి తప్పా మిగతావారి జెండాలు ఎవరివి కూడా అక్కడ కనపడక పోవడం విశేషం. జగన్ పర్యటన కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పవచ్చు.


