కర్నూలు జిల్లా కురువ సంఘం అధ్యక్షులు కె. కిష్టన్న సేవలు మరువలేనివి
1 min read
కర్నూలు జిల్లా కురువ సంఘం
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా కురువ సంఘం అధ్యక్షులు మరియు విశ్రాంత తహసిల్దార్ కే. కిష్టన్న గత 15 రోజుల నుండి జొహరాపురం రోడ్డులోని కిమ్స్ హాస్పిటల్ లో అనారోగ్యంతో ఈరోజు తేదీ :13-08-2026 మధ్యాహ్నం 3 గంటలకు స్వర్గస్తులయ్యారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తికొండ శ్రీనివాసులు, ఎం. కె. రంగస్వామి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, జిల్లా కోశాధికారి కె. సి. నాగన్న మాట్లాడుతూ ,వారి మరణం చాలా బాధాకరం,వారి సేవలు మరువలేనివి,జిల్లా కురువ సంఘం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసారు.వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. వారి కుటుంబ సభ్యులకు కర్నూలు జిల్లా కురువ సంఘం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేయుచున్నాము.


