ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
1 min read
సిమెంట్ రోడ్డుకు ఎమ్మెల్యే భూమి పూజ..
నందికొట్కూరు న్యూస్ నేడు:ప్రజలకు మరింతగా వైద్య సేవలు అందించాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆస్పత్రి సిబ్బందికి సూచించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ఉదయం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు మౌలిక వసతులు రోగులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగారు.వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలన్నారు.
22 లక్షలతో సీసీ రోడ్డుకు భూమి పూజ పట్టణంలోని 29వ వార్డులో
22 లక్షలతో నూతనంగా చేపట్టనున్న సిమెంట్ రోడ్డుకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.మెరుగైన రోడ్లను అభివృద్ధి చేయడం మరియు ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడం ముఖ్య ఉద్దేశమన్నారు.తర్వాత 15వ వార్డులో రెండేళ్ల’ నమ్మకం-అభివృద్ధి సంక్షేమం ఇంటింటికి తెలుగుదేశం పార్టీ’అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని గత రెండేళ్ల పాలనలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి,మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి,ఏఎంసీ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి,మాజీ కౌన్సిలర్లు జాకీర్ హుస్సేన్,భాస్కర్ రెడ్డి, వైద్యులు మరియు అధికారులు పాల్గొన్నారు.


