NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సమరయోధుల ఆశయాల బాటలో నడుద్దాం

1 min read

నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు

దేశభక్తి నినాదాలతో తిరంగా సైకిల్ ర్యాలీ

కర్నూలు , న్యూస్​ నేడు: గురువారం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ.. వారు కలలుగన్న దేశ నిర్మాణంలో పౌరులంతా భాగస్వాములవుదామని, దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు సాగుదామని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం చారిత్రాత్మక కట్టడమైన కొండారెడ్డి బురుజు నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం వరకు త్రివర్ణ పతాకాలతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధులు దేశం కోసం చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, వారు కలలుగన్న స్వేచ్ఛా, సమానత్వం, ఐక్యతతో కూడిన భారతదేశ నిర్మాణానికి మన వంతు కృషి చేయాలని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల ఆశయాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ.. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాల బాటలో నడుస్తూ.. దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని కమిషనర్ కోరారు.కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం.రఘు, కార్యదర్శి నాగరాజు, ఎంఈ మనోహర్ రెడ్డి, డిఈఈ పవన్ కుమార్ రెడ్డి, సానిటరీ సూపర్వైజర్ రమేష్ బాబు, అధికారులు, సానిటరీ ఇంస్పెక్టర్‌లు, తదితరులు పాల్గొన్నారు.

About Author