NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రసూతి మరణాలు జరగకూడదు

1 min read

ఆశా, ఏఎన్‌ఎంలు గర్భిణీలకు అందుబాటులో ఉండాలి.. జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు, న్యూస్​ నేడు : జిల్లాలో ప్రసూతి మరణాలు సంభవించకుండా ప్రతి గర్భిణీకి సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి వైద్యాధికారులను  ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో  ప్రసూతి మరణాలపై సంబంధిత వైద్యాధికారులు, సిబ్బంది, ఐసిడిఎస్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఏప్రిల్ 2026 నుండి  జూన్ 2026 వరకు చోటు చేసుకున్న 4  మాతృమరణాలకు సంబంధించి నివేదికలను పరిశీలిస్తూ ప్రతి కేసులో ఏమి జరిగింది, మరణానికి దారితీసిన కారణాలు ఏమిటి అనే అంశాలను కలెక్టర్  సంబంధిత వైద్య అధికారులు, ఏఎన్ఎమ్ లను  ఆరా తీశారు.. రికార్డులను పరిశీలించి  బిపి, హీమోగ్లోబిన్, బరువు తదితర అంశాలతో పాటు గర్భవతులుగా రిజిస్టర్ అయినప్పటి నుండి అంగన్వాడి వర్కర్లు, ఏఎన్ఎమ్ లు, మెడికల్ ఆఫీసర్ లు ఏ విధమైన చికిత్స అందించారు అని కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు..ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంల పాత్ర చాలా ముఖ్యమైనదన్నారు. ఆసుపత్రిలో చేరిన గర్భిణీ పేషెంట్లను నిరంతరం పర్యవేక్షించాల్సిన బాధ్యత ఆసుపత్రి వైద్య సిబ్బందిపై ఉందని, పేషెంట్ల కదలికలు మరియు ఆరోగ్య పరిస్థితిపై తగిన నిఘా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం లేదా పర్యవేక్షణ లోపాలు ఉంటే సంబంధిత సిబ్బందికి నోటీసులు జారీ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.. గర్భిణీ స్త్రీలకు క్రమం తప్పకుండా  పరీక్షలు నిర్వహించి,  వారు ఆరోగ్యంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్వో డా.కామేశ్వర ప్రసాద్, డి సి హెచ్ ఎస్ డా.జాఫ్రుల్లా, ఐసిడిఎస్ పిడి విజయ, వైద్యాధికారులు,  తదితరులు పాల్గొన్నారు.

About Author