NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీఓఎస్ఎస్ 2026–27 ప్రవేశాలపై కర్నూలులో సమీక్ష

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీఓఎస్ఎస్) 2026–27 విద్యా సంవత్సర ప్రవేశాలపై రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి అధికారుల సమక్షంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.అర్హులైన ప్రతి విద్యార్థికి ఓపెన్ స్కూల్ విద్య అందేలా చర్యలుప్రజా అంకితం కర్నూలు, ఆగస్టు 13: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీఓఎస్ఎస్) 2026–27 విద్యా సంవత్సర ప్రవేశాలపై కర్నూలు జిల్లాలో రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి అధికారుల సమక్షంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీఓఎస్ఎస్ డైరెక్టర్ నరసింహరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఓపెన్ స్కూల్ ప్రవేశాల ప్రక్రియ, కోఆర్డినేటర్ల బాధ్యతలు, విద్యార్థులకు అందించాల్సిన సేవలపై సమీక్షించారు. అర్హులైన విద్యార్థులను గుర్తించి, వారికి ఓపెన్ స్కూల్ విద్యపై అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు. విద్యార్థులను ప్రోత్సహించి క్రమం తప్పకుండా చదువుకునేలా మోటివేట్ చేయడంతో పాటు, ప్రతి విద్యార్థికి రైటింగ్ ప్రాక్టీస్ చేయించి పరీక్షలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలని తెలిపారు.ఏఐ కోఆర్డినేటర్లు, ఎంఈఓలు సమన్వయంతో పనిచేసి అర్హులైన విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించాలని, వారి విద్యా ప్రగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఓపెన్ స్కూల్ విద్యను మరింత బలోపేతం చేసి కర్నూలు జిల్లాను రాష్ట్రంలో ముందంజలో నిలిపేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.సాధారణ విద్యకు దూరమైన విద్యార్థులు, చదువును మధ్యలో నిలిపివేసిన వారు, వివిధ కారణాలతో రెగ్యులర్ పాఠశాలల్లో విద్యను కొనసాగించలేని వారికి ఓపెన్ స్కూల్ ద్వారా తిరిగి చదువుకునే అవకాశం లభిస్తుందని జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. ఇలాంటి విద్యార్థులను గుర్తించి, ఓపెన్ స్కూల్ విధానం ద్వారా విద్యను కొనసాగించేలా అవసరమైన అవగాహన కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఎల్. సుధాకర్, ఏసీజీఈ హెచ్. గోవిందనాయక్, సమగ్ర శిక్ష ఏపీసీ, స్టేట్ కోఆర్డినేటర్లు శ్రీనివాసులు, రవీంద్ర, ఎంఈఓలు, ఏఐ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author