NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఐటీడీఆర్ సెంటర్ నిర్మాణ పనుల పరిశీలన

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: డోన్ మండలం కొత్తకోట సమీపంలో నిర్మాణంలో ఉన్న ఐటీడీఆర్ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్) సెంటర్ నిర్మాణ పనులను జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ డా. సుందర్ వడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా సెంటర్ నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ పరిశీలనలో ఆర్‌అండ్‌బీ డీఈ మదన్ గోపాల్, మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) టి. క్రాంతికుమార్, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు, ఆర్టీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author