నేటినుండి చిప్పగిరిలో తి.తి.దే. ధార్మిక కార్యక్రమాలు
1 min read
డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తి.తి.దే.
చిప్పగిరి, న్యూస్ నేడు: తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో మండల కేంద్రమైన చిప్పగిరిలో వెలసిన శ్రీ గోవిందప్ప స్వామి దేవస్థానం నందు మంగళవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 6 గంటల నుండి మూడు రోజులపాటు స్మాత్మానంద స్వామిచే ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు, శుక్రవారం ఉదయం 10 గంటలకు గోపూజ మరియు సామూహిక కుంకుమార్చనలు శనివారం శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం నందు భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను స్థానిక భక్త సమాజంచే ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో భజన మండలి అధ్యక్షులు నాగనాథనహళ్ళి రాఘవాచార్, ఎల్. రామచంద్ర, పి. గురుప్రసాద్, పి.వి.యం. చెన్నవీరయ్యస్వామి, యం. లక్మీ నారాయణ, యస్. లోకేశ్, పి.షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనగలరని విజ్ఞప్తి చేశారు.



