జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
1 min read
ఎన్నికల కమిషన్ మార్గ దర్శకాలను పక్కగా అమలు చేస్తున్నాం
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
మదనపల్లె, న్యూస్ నేడు ప్రతినిధి : జిల్లాలో నిర్వహించ నున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల నిర్వహణ కు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపడు తున్నామని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కు వివరించారు.బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో నిర్వ హించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మదనపల్లె కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంచా యతీ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల మ్యాపింగ్, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు, ఎన్నికల సామగ్రి అవసరాల అంచనా, సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ప్రతి పంచాయతీ, మండలం, మున్సిపాలిటీకి ఎన్నికల అధికారుల నియామకం తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 411 గ్రామ పంచాయతీ లకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి సమస్యలు లేవని తెలిపారు. పోల్ కమ్యూనికేషన్ ప్రక్రియ పూర్తయిందని, పోలీస్ స్టేషన్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభ మైందని, నిర్ణయించిన గడువులోగా ప్రక్రియను పూర్తి చేసేందుకు పనుల వేగాన్ని మరింత పెంచుతామని చెప్పారు. కోర్టు కేసుల కారణంగా ప్రభావితమైన యూఎల్‌బిలకు సంబంధించి అవసరమైన సన్నాహక పనులు పూర్తయ్యాయని, తదుపరి కోర్టు తీర్పు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సుల ను ఇతర జిల్లాల నుంచి సమకూర్చు కోవాల్సి ఉందని, ఇందుకోసం అధికారులను పంపించి అవసర మైన సమాచారాన్ని త్వరలో అందజేస్తా మని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన అన్ని సూచనలు, మార్గదర్శ కాలను నమోదు చేసు కున్నామని, వాటిని నిబంధనల ప్రకారం అమలు చేస్తూ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో వెంకటేష్, జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ, ఎస్జీఎస్డబ్ల్యూ జిల్లా అధికారి అమర్నాథ్ రెడ్డి, మదనపల్లె, రాయచోటి, పుంగ నూరు, బి.కొత్తకోట మున్సిపల్ కమిషనర్లు ప్రమీల, రమణారెడ్డి, మధుసూదన్ రెడ్డి, రమాదేవి పాల్గొన్నారు.


