రోడ్డు ప్రమాద బాధితులకు త్వరిత గతిన బీమా పరిహారం
1 min read
– ‘ఇ-డార్’ నమోదు విధానంపై కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రత్యేక అవగాహన
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : రోడ్డు ప్రమాద బాధితులకు త్వరిత గతిన బీమా పరిహారం అందించేందుకు ‘ఇ-డార్’ నమోదు విధానంపై బుధ వారం మదనపల్లె డీపీఓలో కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి హాజరై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.ప్రమాదం జరిగిన వెంటనే వాహనం, బాధితుల వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డి.టి.ఆర్.బి. ఇన్‌స్పెక్టర్ డి. రమేష్ బాబు, ఎన్.ఐ.సి. ప్రతినిధి ఎస్. ఖలీల్, జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ల కంప్యూటర్ సిబ్బంది పాల్గొన్నారు.


