నిత్యావసర సరుకుల ధరలు తగ్గించడంలో ప్రభుత్వాలు విఫలం
1 min read
– కాంగ్రెస్ పార్టీ ఓబీసీ కో ఆర్డినేటర్ దేవిశెట్టి ప్రకాష్
ఆదోని న్యూస్ నేడు : భారతదేశంలో రోజు రోజుకూ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమిప్రభుత్వం ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యాయని కాంగ్రెస్పార్టీ ఓబీసీ కో ఆర్డినేటర్ దేవిశెట్టి ప్రకాష్ ఆరోపించారు. సోమవారం ఆయనసబ్కలెక్టర్ కార్యాలయంలోని ఆర్డీఓ ఆరుణాదేవికి, తహసీల్దార్, సీఎస్ఓటీలకువినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూవంటనూనె లీటర్ రూ.195, చక్కెర రూ.75, బియ్యం రూ.75 చొప్పునవిపరీతంగా ధరలు పెరిగాయన్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలుకొనలేని పరిస్థితి నెలకొందన్నారు. అలాగే రేషన్ దుకాణాల నుంచి కూడాబియ్యం, చక్కెర ప్రజలకు సక్రమంగా అందడంలేదన్నారు. వెంటనేవినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వంటనూనె లీటర్ రూ.195, చక్కెర రూ.75, బియ్యం రూ.75 చొప్పున విపరీతంగా ధరలు పెరిగాయన్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలుకొనలేని పరిస్థితి నెలకొందన్నారు. అలాగే రేషన్ దుకాణాల నుంచి కూడాబియ్యం, చక్కెర ప్రజలకు సక్రమంగా అందడంలేదన్నారు. వెంటనేఉన్నతాధికారులు విచారణ చేపట్టి రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలుతీసుకోవాలన్నారు. నిత్యావసర ధరలను నియంత్రించేంతవరకు తాముపోరాడుతూనే ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులుబి. తాయన్న, ఎం.హనుమంతు పాల్గొన్నారు.


