రాష్ట్ర ముఖ్యమంత్రి కి అపూర్య ఘనస్వాగతం
1 min read
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ముసునూరు మండలం ముసునూరు గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ముందుగా రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు,రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి లు పూలమొక్కలను అందించి రాష్ట్ర ముఖ్యమంత్రికి సాదరంగా ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, డా.కామినేని శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, ఏపి అప్కాబ్ చైర్మన్ మరియు ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఐజిపి జి. వి. జి. అశోక్ కుమార్,జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ,ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్,జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ, జిల్లా అటవీశాఖ అధికారి పి.వి.సంధీప్ రెడ్డి, ఏపి అగ్రికల్చర్ మిషన్ వైస్- చైర్మన్ మరియు నూజివీడు నియోజకవర్గ పరిశీలకులు మారెడ్డి శ్రీనివాసరెడ్డి లు పూలమొక్కలు, పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతీ ఒక్కరినీ పేరుపేరున పలకరించారు. స్వాగతం పలికిన వారిలో మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, కూటమి నాయకులు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.



