NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈ నెల 28న జరిగే రాష్ట్ర సదస్సు ను జయప్రదం చేయాలి

1 min read

ఏలూరు జిల్లా  చైర్మన్ కె. రమేష్ కుమార్ పిలుపు

సిపిఎం కార్యాలయం మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో కార్యక్రమం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక నరసింహారావు పేట రెవిన్యూ భవనం ఏలూరులో ఏపీజెసీ అమరావతి జిల్లా స్థాయి సమావేశము ఏపీ జెసి అమరావతి, ఏలూరు జిల్లా చైర్మన్ కె.రమేష్ కుమార్  అధ్యక్షతన నిర్వహించడము జరిగినది.సదరు సమావేశము లో కె.రమేష్ కుమార్ మాట్లాడుతూ   28.08.2026 శుక్రవారము నాడు విజయవాడ సిపిఎం కార్యాలయము వద్ద గల మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియం లో ఏపీజేఏసీ రాష్ట్ర చైర్ పర్సన్ బొప్ప రాజు వెంకటేశ్వర్లు అద్యక్షతన జరిగే రాష్ట్ర సదస్సు ను అందరు జయప్రదము చెయ్యవలెనని ఏపీజేఏసీ అమరావతి, ఏలూరు జిల్లా  చైర్మన్ కె. రమేష్ కుమార్ పిలుపునిచ్చారు.  ఉద్యోగులకు ఉద్యమమే శరణ్యం ఉద్యోగులు అందరు ఉద్యమానికి సిద్దం కావలని పిలుపునిచ్చారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పై బడిన  ఉద్యోగులు,ఉపాధ్యాయులు, పెన్షనర్లు, సచివాలయ ఉద్యోగులు మరియు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఏపీ జేఏసీ అమరావతి ఏలూరు జిల్లా చైర్మన్ కె.రమేష్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల హక్కుల సాధనకై 28న విజయవాడ సిపిఎం కార్యాలయము వద్ద గల మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో రాష్ట్ర సదస్సు నకు ఉద్యోగులు,ఉపాధ్యాయులు,పెన్షనర్లు, సచివాలయ ఉద్యోగులు మరియు కాంట్రాక్ట్,అవుట్ సోర్సింగ్  ఉద్యోగులు అందరు వేలాదిగా సదరు సదస్సు లో పాల్గొనాలని,అదేవిధముగా సదరు సదస్సు లో మన ఉద్యోగుల సమస్యల పరిష్కారము కొరకు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తారని,అదేవిధముగా సదరు సదస్సు నిర్వహణలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తిన దాని పూర్తి భాద్యత ప్రభుత్వమే వహించాలాని. కావున ఉద్యోగులు అందరు కలసి కట్టుగా పోరాడితేనే మన సమస్యలకు పరిష్కారము దొరుకుతుందని తెలియజేసారు. ఈ కార్యక్రమములో జనరల్ సెక్రెటరి బి.రాంబాబు,మహిళా విభాగము చైర్ పర్సన్ గీతిక, వైస్ చైర్మన్బి.సత్యనారాయణ,నాగేశ్వర రావు,గ్రామా వార్డ్ సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర నాయకురాలు జ్యోతి,జిల్లా అధ్యక్షులు కమల్,ఆర్ బ్ల్యూ ఎస్ ఇంజనీర్స్ జిల్లా అధ్యక్షులు సిచ్.వర్మ , రెవిన్యూ అసోసియేషన్ ఏలూరు డివిజన్ అధ్యక్షులు కృష్ణ స్వామి,జంగారెడ్డి గూడెం కార్యదర్శి రాధా కృష్ణ , క్లాసు -4, పెన్షనర్స్ అసోసియేషన్, డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులూ మరియు వివిధ సంఘముల నాయకులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *