‘ఒరేయ్ బామ్మర్ది’ సినిమా రివ్యూ
1 min readసినిమా : ఓరేయ్ బామ్మర్ది
నటీనటులు : సిద్ధార్థ్ , జివి. ప్రకాశ్ కుమార్, లిజోమల్ జోస్, కష్మీరా, మధుసూధన్, దీప రామానుజమ్, ప్రేమ్
దర్శకత్వం : శశి
నిర్మాణం : శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్
నిర్మాత : ఏ. ఎన్. బాలాజీ
సంగీతం : సిద్ధుకుమార్
చాయా గ్రహణం : ప్రసన్న ఎస్. కుమార్
విడుదల : 13-8-2021
ఒకప్పుడు డ్రీమ్ బాయ్ గా వెలుగు వెలిగిన సిద్ధార్థ్ … ఆ తర్వాత వరుస అపజయాలతో వెనుకబడ్డాడు. అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ.. అవి ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. తాజాగా బిచ్చగాడు సినిమా దర్శకుడు శశి దర్శకత్వంలో ‘ఓరేయ్ బామ్మర్ది` సినిమాలో సిద్ధార్థ్ ప్రధానపాత్ర పోషించాడు. సిద్ధార్థ్ తో పాటు జివి. ప్రకాశ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించిందా ?.
కథ :
హీరో సిద్ధార్థ్ ట్రాఫిక్ ఎస్ఐ ( రాజశేఖర్ ) గా పనిచేస్తుంటాడు. జివి ప్రకాశ్ కుమార్ (మదన్) కు బైక్ రేస్ లంటే ప్రాణం. బైక్ రేస్ పోటీల్లో భాగంగా జివి. ప్రకాశ్ కుమార్ ట్రాఫిక్ లో చేజింగ్ పోటీలో పాల్గొంటాడు. సిగ్నల్స్ జంప్ చేసి వెళ్లే క్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రాజశేఖర్ ( సిద్ధార్థ్)కి పట్టుబడతాడు. ఎస్ఐ రాజశేఖర్ .. మదన్ (జివి. ప్రకాశ్ కుమార్)కు ఆడవారి నైటీ వేసి టెర్రస్ మీద నుంచి లాక్కుంటూ కిందికి తీసుకొస్తాడు. అరెస్టు చేసి జైల్లో వేస్తాడు. ఇది చూసిన జనం నవ్వుతారు. అవమానంగా ఫీలైన మదన్ ఎస్ఐ రాజశేఖర్ మీద పగపెంచుకుంటాడు. మదన్ జీవితంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. తన ప్రాణంగా ప్రేమించే అక్కకు.. తను తీవ్రంగా ద్వేషించే ఎస్ఐ రాజశేఖర్ తో పెళ్లి అవుతుంది. దీన్ని మదన్ జీర్ణించుకోలేడు. మదన్ అనుకోకుండా దొంగతనం కేసులో ఇరక్కుంటాడు. దీని నుంచి మదన్ ను బయటపడేసేందుకు ఎస్ఐ రాజశేఖర్ ప్రయత్నిస్తాడు. దొంగతనం కేసు నుంచి మదన్ బయటపడ్డాడా ?. ఎస్ఐ రాజశేఖర్ పై పగ చల్లారుతుందా?. బావాబామ్మర్దులు ఏకమవుతారా ? అన్నది సినిమాలో చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే :
బిచ్చగాడు సినిమా దర్శకుడు శశి అనగానే ఓరేయ్ బామ్మర్ది సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. టీజర్, ట్రైలర్ కూడ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాకి మంచి హైప్ క్రియేట్ అయింది. సినిమాలో ప్రధానంగా మొదటి భాగంలో అక్క, తమ్ముడి సెంటిమెంట్ ను దర్శకుడు పండించే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో దర్శకుడు కొంత మేర సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. సినిమా మొదటి భాగంలో ఎక్కువగా జివి. ప్రకాష్ కుమార్, లిజోమల్ మధ్య సెంటిమెంట్ నే ప్రధానంగాచూపించాడు. రెండో భాగంలో బావా, బామ్మర్దుల బంధం, వారి మధ్య నెలకొన్న ద్వేషానికి సంబంధించిన సీన్ల పైనే దర్శకుడు దృష్టి కేంద్రీకరించాడు. మొదటి భాగంలో సినిమా చూసినప్పుడు ఫర్వాలేదనిపిస్తుంది. రెండో భాగంలో సినిమాలో ఇంకా ఏదో ఉంది అన్న ఆసక్తిని రేకెత్తించగలిగాడు. కానీ .. రెండో భాగంలో కథ పూర్తీగా గాడి తప్పింది. కథ యాక్షన్ థ్రిల్లర్ గా పరిణామం చెందుతుంది. కథలో రెండు యాక్షన్ ట్రాక్ లు నడుస్తాయి. జివి. ప్రకాష్ కుమార్ , విలన్ మధు సూధన్ యాక్షన్ ట్రాక్ లు చాలా బలహీనంగా ఉన్నాయి.
కథలో కొత్తదనం లేదు. రోటీన్ సీన్స్ సినిమాలో కనిపిస్తాయి. నిర్మాణ విలువలు బలహీనంగా ఉన్నాయి. సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ చాలా పేలవంగా, బలహీనంగా ఉన్నాయి. బిచ్చగాడు సినిమా దర్శకుడు నుంచి ప్రేక్షకుడు పెట్టుకున్న అంచనాల్ని ఏ మాత్రం ఈ సినిమా అందుకోలేకపోయింది. సినిమాలో కూర్చున్నంత సేపు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టారు.
నటీనటుల ఫర్మార్మెన్స్ :
సిద్ధార్థ్ ఎస్ఐ రాజశేఖర్ పాత్రలో బాగా నటించారు. జివి. ప్రకాశ్ కుమార్ కూడ తన పాత్రలో ఒదిగిపోయాడు. అక్క పాత్రలో లిజోమల్ జోస్ కూడ తన పాత్ర మేరకు బాగా నటించారు. సిద్ధార్థ్- ప్రకాశ్ మధ్య సీన్స్ కొంత ఆసక్తికరంగా ఉంటాయి. లిజోమల్ జోస్, ప్రకాష్ కుమార్ మధ్య సీన్స్ కూడ ఫర్లేదు. ప్రధానంగా అక్క, బావ, బామ్మర్ది.. ఈ మూడు పాత్రల చుట్టూనే సినిమా తిరుగుతుంది.
ముగింపు :
బిచ్చగాడి దర్శకుడి నుంచి ఇలాంటి సినిమాని ప్రేక్షకుడు ఊహించలేడు. ప్రేక్షకుల అంచనాల్ని అందుకోవడంలో దర్శకుడు దారుణంగా విఫలమయ్యారు. సిద్ధార్థ్ నుంచి ఇలాంటి సినిమాని ఎక్స్ పెక్ట్ చేయలేరు.
గమనిక : ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం.