రేపటి నుండి జరగబోయే ఉద్యమ కార్యాచరణ పై కలెక్టరుకు నోటీసు అందజేత
1 min read
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 31.08.2026 వ సోమవారం ఏలూరు జిల్లా కలక్టర్ కె.వెట్రీ సెల్వి ని పీజీ ఆర్ ఎస్ కార్యక్రమములో ఏపీజేసీ అమరావతి , ఏలూరు జిల్లా చైర్మన్ కె.రమేష్ కుమార్ అద్వార్యములో కలిసి ఉద్యోగుల న్యాయమైన 29 డిమాండ్ లతో మరియు రేపటి నుండి జరగబోయే ఉద్యమ కార్యాచరణ వివరములుతో నోటీసు ఇవ్వడము జరిగినది.
కార్యాచరణ వివరములు :
01-09-2026 వ తేదీ ఉద్యోగులు అందరూ కూడా మీ యొక్క వాట్స్ అప్ డీపీ (ప్రొఫైల్ ఫోటో) “సీఎం , మా డబ్బులు మాకివ్వండి” అని ఉద్యమ కార్యాచరణ పూర్తి అయ్యేవరకు పెట్టుకోవాలి.
01-09-2026 వ తేదీ నుండి 05-09-2026 వ తేదీ వరకు ప్రతి ఉద్యోగి నల్ల బ్యాడ్జీ లు ధరించాలి.
2-09-2026 వ తేదీ నుండి 8-09-2026 వ తేదీ వరకు ప్రతి ఉద్యోగి “హ్యాండ్ టూ హ్యాండ్ ” కార్యక్రమములో భాగముగా అన్నీ కార్యాలయములలో మరియు డివిజనల్ & జిల్లా కార్యాలయములను సందర్శించి కరపత్రాలను పంపిణీ చేసి ఆందోళనకు దారితీసిన కారణాలను సవివరంగా వివరించాలి.
3-09-2026 అలాగే 5-09-2026 వ తేదీన మధ్యాహ్న బోజన విరామ సమయంలో నిరసనలు చేయాలి.
ఉద్యోగులు అందరూ కూడా సదరు కార్యాచరణని అమలు చేసి మన న్యాయమైన డిమాండ్లు మనము పొందే వరకు అందరూ కలిసికట్టు గా పై తెల్పిన కార్యాచరణ లను తప్పక పాటించాలని చైర్మన్ కె. రమేష్ కుమార్ కొరియున్నారు. ఈ కార్యక్రమములో జనరల్ సెక్రెటరి బి. రాంబాబు, మహిళా విభాగము చైర్ పర్సన్ గీతిక, మహిళా విభాగము వైస్ చైర్మన్ శాంత కుమారి, మహిళా విభాగము జనరల్ సెక్రెటరీ భాశీరా, రెవెన్యూ సర్వీసెస్ అస్సోసియేషన్ జిల్లా ఉపద్యక్షులు రవిచంద్ర, వైస్ చైర్మన్ బి. సత్యనారాయణ, నాగేశ్వర రావు, గ్రామా వార్డ్ సచివాలయ ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు కమల్, ఆర్ డబ్ల్యు చ్ ఇంజనీర్స్ జిల్లా అధ్యక్షులు సిచ్ .వర్మ, , క్లాసు -4, పెన్షనర్స్ అసోసియేషన్, డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులూ మరియు వివిధ సంఘముల నాయకులూ పాల్గొన్నారు.ఎ ఆర్ డబ్ల్యు ఎస్ ఇంజనీర్స్ జిల్లా అధ్యక్షులు సిచ్.వర్మ, , క్లాసు -4, పెన్షనర్స్ అసోసియేషన్, డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులూ మరియు వివిధ సంఘముల నాయకులూ పాల్గొన్నారు.


