NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అధిష్టానం ఆదేశిస్తే..చైర్మన్ బరిలో ఉంటా

1 min read

ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ

పట్టణ టీడీపీ నాయకులు  అబ్దుల్ అజీస్..

నందికొట్కూరు న్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ తెదేపా అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పట్టణ టీడీపీ సీనియర్ నాయకులు ఎస్ అబ్దుల్ అజీస్ అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణానికి చెందిన అబ్దుల్ అజీస్ పట్టణ పేద ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ నిరుపేదలకు నిత్యవసర సరుకులు మరియు ఆర్థికంగా నగదు అందజేస్తూ కుటుంబాలకు అండగా నిలుస్తూ ఉన్నారు.

అవకాశమిస్తే పేదలకు పట్టణ అభివృద్ధికి కృషి

టీడీపీ నేత మాండ్ర శివానంద రెడ్డి, నందికొట్కూరు టిడిపి ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డి మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సహకారంతో త్వరలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా నాకు అవకాశమిస్తే పట్టణ ఓటర్ల ఆశీర్వాదంతో మున్సిపాలిటీ చైర్మన్ గా గెలుపొంది పట్టణ ప్రజలకు మరియు పట్టణ అభివృద్ధికి కృషి చేసి నిరూపిస్తానని అబ్దుల్ అజీస్ అన్నారు.ప్రజలకు సేవ చేసే ఒక గొప్ప బాధ్యతగా తాను భావిస్తున్నానని“పదవి కోసం కాదు..ప్రజా సేవ కోసం బాధ్యత తీసుకుంటానని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తున్నారు.

About Author