NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఆదరించండి

1 min read

ఎంపీ పుట్టా మహేష్ కుమార్

‎ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దెందులూరు నియోజకవర్గంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పర్యటనచల్లచింతలపూడి -కండ్రిగ నరసింహాపురం రోడ్డు పనులకు భూమి పూజ మరియుస్మశాన వాటికలో షెడ్డు నిర్మాణానికి 1 లక్ష ఎంపీ లాడ్స్ నిధులు మంజూరు.గ్రామస్తులతో ఎంపీ, ఎమ్మెల్యేల ముఖా ముఖి సంభాషణ చేశారు. సోమవారం దెందులూరు నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా గొల్లగూడెం గ్రామంలో కొత్తగా నిర్మించిన కుంకుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎంపీ పట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే చింతమనేని పాల్గొన్నారు. అక్కడినుంచి చల్లచింతలపూడి వెళ్ళిన నేతలు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి 1.38 కోట్ల ఏపీ ఆర్ ఇ ఎస్ పి -పి ar ఆర్ ప్లెయిన్ గ్రాంటు నిధులతో నూతనంగా నిర్మించనున్న చల్లచింతలపూడి -కండ్రిగ నరసింహాపురం రోడ్డు పనులకు భూమి పూజ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో అనేక రోడ్లను  నిర్మించుకుంటున్నామన్నారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులను కూడా సమాంతరంగా తీసుకెళుతున్నామని చెప్పారు. స్థానిక ఎన్నికలు వస్తున్న విషయాన్ని ప్రస్తావించిన ఎంపీ, ఎన్నికల్లో గెలవడం కోసం మోసపు మాటలు చెప్పే వారిని నమ్మకుండా, అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని మళ్లీ మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామ స్మశాన వాటికలో షెడ్డు నిర్మాణానికి ఎంపీ లాడ్స్ నుంచి ఒక లక్ష రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు గ్రామస్థుల హర్షధ్వానాల మధ్య ఎంపీ ప్రకటించారు. సభలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ తన ఎంపీ లాడ్స్ నిధులను పూర్తిగా ప్రజాప్రయోగ పనులకు మాత్రమే నిజాయితీగా ఉపయోగిస్తూ పనిచేస్తున్న ఎంపీని అభినందిస్తున్నట్లు చెప్పారు. సభలో గ్రామస్తుల నుంచి వచ్చిన పలు వినతులను స్వీకరించిన ఎంపీ ఎమ్మెల్యేలు వాటి తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.  ఈ కార్యక్రమం అనంతరం పెరుగుగూడం చేరుకున్న ఎంపీ ఎమ్మెల్యేలు స్థానిక రామాలయంలో పూజలు నిర్వహించి, పార్టీ కార్యకర్తకు చెందిన శ్రీ పరమేశ్వర పెస్టిసైడ్స్ షాపు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం అదే గ్రామంలో “ఆయుష్ ఆరోగ్య మందిర్” భవన నిర్మాణానికి ఎంపీ, ఎమ్మెల్యే భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో చల్లచింతలపూడిలో టీడీపీ నేత బాలిన నాగరాజు, లక్ష్మీ దంపతుల కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరైన ఎంపీ నూతన దంపతులను ఆశీర్వదించి “పెళ్లి కానుక” బహుమతులను అందజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *