కొత్త ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ
1 min read
హొళగుంద న్యూస్ నేడు: ప్రజలకు మరింత మెరుగైన సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లను మంజూరు చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తోంది.కొత్త పింఛన్ల కోసం సెప్టెంబర్ 7 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులైన వారు తమ పరిధిలోని సచివాలయం లేదా గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.దరఖాస్తుదారులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం, సంబంధిత పింఛన్‌కు అవసరమైన ఇతర ధృవపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.వితంతు పింఛన్‌కు భర్త మరణ ధృవపత్రం, ఒంటరి మహిళలకు భర్త మరణ ధృవపత్రంతో పాటు వివాహం కాని మహిళలకు అవసరమైన ధృవపత్రం, దివ్యాంగుల పింఛన్‌కు సదరం ధృవపత్రం వంటి పత్రాలు అవసరమని అధికారులు తెలిపారు.దరఖాస్తుల స్వీకరణ అనంతరం అర్హతలను పరిశీలించి పింఛన్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. పింఛన్ కోసం ఎవరికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.


