NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకండి

1 min read

– వైఎస్సార్‌సీపీ శ్రేణులకు కాటసాని రామభూపాల్ రెడ్డి పిలుపు…!!!

నంద్యాల, న్యూస్​ నేడు: నంద్యాల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి  ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా స్థాయి పార్టీ సమావేశం చాపిరేవుల గ్రామ సమీపంలోని ఎస్‌.ఆర్‌. కన్వెన్షన్ హాల్‌లో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు..రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని కాటసాని రామభూపాల్ రెడ్డి  పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని, ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆదేశించారు.

అనంతరం నియోజకవర్గ ఇంచార్జీలకు ,పరిశీలకులకు,CEC & SEC మెంబర్లకు పార్టీ గుర్తింపు కార్డులను అందజేశారు…

ఎన్నికల కార్యాచరణపై కాటసాని దిశానిర్దేశం..

జిల్లా స్థాయి సమావేశంలో కాటసాని రామభూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ…!!!సెప్టెంబర్ 8 నుంచి 11వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయి సమావేశాలు, సెప్టెంబర్ 12 నుంచి 22వ తేదీ వరకు మండల స్థాయి సమావేశాలు నిర్వహించాలని సూచించారు..అనంతరం సెప్టెంబర్ 23వ తేదీ నుంచి గ్రామ, వార్డు స్థాయిలో ఇంటింటి ప్రచారం చేపట్టాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు..వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని సూచించారు…ప్రచారంలో భాగంగా బుక్‌లెట్లను ఇంటింటికీ పంపిణీ చేస్తూ ప్రజలతో నేరుగా మమేకం కావాలని, స్థానిక సమస్యలను తెలుసుకుని వాటిపై పోరాటం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు..

ప్రజలే వైఎస్సార్‌సీపీకి బలం… కార్యకర్తలే పార్టీకి వెన్నెముక…

ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేసేలా సమష్టి కృషి చేయాలని కాటసాని రామభూపాల్ రెడ్డి  స్పష్టం చేశారు…ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మరియు నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు శ్రీమతి కల్పలత రెడ్డి , నంద్యాల మాజీ ఎంపీ శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డి , ఎమ్మెల్సీ ఇషాక్ బాషా ,బనగానపల్లె నియోజకవర్గ ఇంచార్జీ శ్రీ కాటసాని రామిరెడ్డి,నందికొట్కూరు ఇంచార్జీ శ్రీ దారా సుధీర్ గారు, CEC & SEC సభ్యులు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీలు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *