రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలి పోలీస్స్టేషన్ పరిధిలో రౌడీషీటర్లకు ఎస్సై నాగార్జున ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వారు, చెడు నడత కలిగిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని ఎస్సై సూచించారు.


