ఎన్టీఆర్ ట్రస్ట్ సీఓఓ గోపినాయుడిని పరామర్శించిన మంత్రి లోకేష్
1 min read
పాకాల, న్యూస్ నేడు: ఎన్టీఆర్ ట్రస్ట్ సీఓఓ (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) అడుసుపల్లి గోపి నాయుడు, కుటుంబ సభ్యులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదివారం పరామర్శించారు. ఇటీవల గోపి నాయుడు తండ్రి ఆంజనేయులు నాయుడు స్వర్గస్థులయ్యారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా పాకాల మండలం అడుసుపల్లి గ్రామంలోని వారి నివాసానికి వెళ్లిన మంత్రి లోకేష్.. గోపినాయుడు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు నాయుడు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మంత్రి వెంట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిలారు రాజేష్, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గాలి భానుప్రకాష్, మురళీమోహన్, చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి ఉన్నారు.



