అంతర్జాతీయ ప్రశంసా పురస్కారం అందుకున్న లయన్ డా. రాయపాటి శ్రీనివాస్
1 min read
కర్నూలు,న్యూస్ నేడు: అసోసియేషన్ ఆఫ్ అలియాన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సౌత్ మల్టిపుల్ కౌన్సిల్ సమావేశంలో హైదరాబాద్ వెంకటేశ్వర అడోబ్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ ఆఫ్ అలియన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల్లో విశేషంగా కృషి చేస్తున్న జిల్లా గవర్నర్ లయన్ డా. రాయపాటి శ్రీనివాస్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసా పురస్కారం లభించింది. సంస్థ అంతర్జాతీయ అధ్యక్షులు అల్లీ బలగంగాధర శాస్రి చేతుల మీదుగా ఆయన ఈ ఇంటర్నేషనల్ అప్ప్రిసియేషన్ అవార్డు ను అందుకున్నారు. సేవా కార్యక్రమాల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ దక్కిన గౌరవమని డా. రాయపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో 100 జిల్లాల గవర్నర్లు వైస్ డిస్టిక్ గవర్నర్లు మరియు అలై సత్యవతి బసవరాజ్ – ఎస్ఎంసీ కోశాధికారి, అలై ఉషారాణి అత్లూరి – ఎస్ఎంసీ కార్యదర్శి, అలై ఎం. ఆర్. రమేష్ – అంతర్జాతీయ కోశాధికారి, అలై యు. గోకుల్ కృష్ణ – ఎస్ఎంసీ ఉపాధ్యక్షుడు-2, అలై కె. టి. హనుమంత్ – ఎస్ఎంసీ ఉపాధ్యక్షుడు-1, అలై జె. శరవణన్ – ఐపీఎస్ఎంసీసీ, అలై డీబీజీ. శాస్త్రి – అంతర్జాతీయ అధ్యక్షుడు, అలై ఎం. కల్లాజగర్ – ఐవీపీ-3, అలై కె. రాజేశ్వరరావు – ఐవీపీ-2, అలై బి. ఎస్. తోమర్ – ఐవీపీ-1, అలై సి. బాలచంద్రన్ – పీఐపీ, అలై వి. ఎం. రావు – పీఐపీ, అలై బి. టి. రాజు – వ్యవస్థాపకుడు & పీఐపీ, అలై ఆర్. కె. సక్సేనా – ఐపీఐపీ, అలై ఎ. సి. ఓహ్రి – పీఐపీ, అలై అనూప్ మిట్టల్ – వ్యవస్థాపకుడు & పీఐపీ, అలై మోరా అంజయ్య – ఎస్ఎంసీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు


