కౌతాళం జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షులు
1 min read
కౌతాళం , న్యూస్ నేడు : కర్నూలు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అక్కమ్మతోట రామకృష్ణ పరమహంస కౌతాళం జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు.ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుంచి రాజ్ విహార్ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి, అనంతరం నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ నాయకులు, జిల్లా ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


