‘బ్రైడ్స్ ఆఫ్ ఇండియా’కు శ్రీకారం చుట్టిన ‘మలబార్’
1 min readపల్లెవెలుగు వెబ్ : పాత సంప్రదాయాలకు… మూస పద్దతులకు హంగులు అద్దుతూ… వివాహ ఘట్టంలో వధువు పెళ్లి మండపంలోకి ప్రవేశించే అద్భుత సన్నివేశాలను చూపిస్తూ… “మేక్ వే ఫర్ ది బ్రైడ్స్ ఆఫ్ ఇండియా ”వివాహ గీతాన్ని ఆవిష్కరించింది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ యాజమాన్యం. మూడు నిమిషాల నిడివి గల వివాహ గీతంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వధువులతోపాటు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ బ్రాండ్ అంబాసిడర్లు అనిల్ కపూర్ , కరీనా కపూర్ ప్రత్యేకంగా కనిపిస్తారు. అభిషేక్ బచ్చన్ నటించిన ‘ ది బిగ్ బుల్ ’ సినిమాకు దర్శకత్వం వహించిన కూకి గులాటి, లవ్ ఆజ్ కల్ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పని చేసిన అమితా రాయ్, పీకు ఫేమ్ అనుపమ్ రాయ్ స్వరకర్తగా మరియు విక్కీ డోనర్ ఫేమ్ రచయిత జూహీ చతుర్వేది గీత రచయితగా ఇందులో భాగస్వామ్యం వహించారు. ఈ సందర్భంగా మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పీ.అహ్మద్ మాట్లాడుతూ దేశంలో పదేళ్లుగా వధువరులకు బహుముఖ ప్రజ్ఞను అందించడంలో, వధువు అవసరాలకు తగిన రీతిలో ఆభరణాలు అందించడంలో సఫలమయ్యామని చెప్పేందుకు గర్విస్తున్నాము. ‘ బ్రైడ్స్ ఆఫ్ ఇండియా’ క్యాంపెయిన్‌లో భాగంగా దేశంలోని 13 మంది వధువులు రెండు విలక్షణ రూపాల్లో కనిపిస్తారు. పోల్కీ ఆభరణాలు ధరించిన వధువు, స్టేట్మెంట్ మరియు వజ్రాభరణాలతో మెరిసే వధువు, హస్తకళలతో సమకాలిన రిసెప్షన్ వధువు, క్లాసిక్ గోల్డ్ వధువు, కేరళ వధువు, కర్ణాటక వధువు, తెలుగు వధువు, తమిళం వధువు, ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ వధువు తదితర ప్రాంతాల నుంచి 26 ప్రత్యేక మైన లుక్స్‌లో వధువులు కనిపిస్తారని స్పష్టం చేశారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కర్నూలు స్టోర్ హెడ్ ఫయాజ్, మార్కెటింగ్ మేనేజర్ నూర్వుల్లా ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించారు.