టీజీవి గ్రూప్ సంస్థల్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు : తాండ్రపాడు సమీపంలోని టీజీవి గ్రూప్ సంస్థల పరిశ్రమల ప్రాంగణంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా దంపతులు పాల్గొని వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్, టీజీ భరత్ మాట్లాడుతూ వినాయకుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలు నిండాలని ఆకాంక్షించారు. వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుకుంటూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీవి గ్రూప్ సంస్థల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.


