NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మూడు నెలలుగా నిలిచిపోయిన బోరింగ్‌కు కొత్త చైన్ ఏర్పాటు

1 min read

ప్రజా సమస్యపై చొరవ చూపిన ఎస్డీపిఐ – సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు

బోరింగ్‌ను వినియోగంలోకి తీసుకురావడంతో కాలనీ ప్రజల్లో హర్షం

హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండల కేంద్రంలోని 8వ వార్డులో మూడు నెలలుగా నిలిచిపోయిన బోరింగ్ సమస్యకు ఎస్డీపిఐ – సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు చొరవ తీసుకుని పరిష్కారం చూపించారు. బోరింగ్‌కు సంబంధించిన చైన్ లాక్ సుమారు మూడు నెలల క్రితం విరిగిపోవడంతో స్థానికులు నీటి అవసరాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించిన ఎస్డీపిఐ 8వ వార్డు ఇన్‌చార్జ్ ఆరిఫ్, 3వ వార్డు ఇన్‌చార్జ్ వాజిద్ స్పందించారు. కాలనీకి చెందిన సైఫు, ఇమ్రాన్, హసుద్ తదితరుల సహకారంతో తమ సొంత ప్రయత్నంతో బోరింగ్‌కు కొత్త చైన్‌ను ఏర్పాటు చేశారు. దీంతో మూడు నెలలుగా వినియోగానికి దూరమైన బోరింగ్ తిరిగి అందుబాటులోకి వచ్చింది.బోరింగ్‌కు కొత్త చైన్ ఏర్పాటు చేయడంతో కాలనీ ప్రజలకు నీటి వినియోగంలో ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోయాయి. ప్రజలకు అవసరమైన సమస్యను గుర్తించి, అధికారుల కోసం ఎదురుచూడకుండా స్వయంగా చొరవ తీసుకుని పరిష్కరించడంపై కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ఎస్డీపిఐ – సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించాలని కాలనీ ప్రజలు ఆకాంక్షించారు. బోరింగ్ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్న ఆరిఫ్, వాజిద్‌తో పాటు సహకరించిన సైఫు, ఇమ్రాన్, హసుద్ తదితరులకు కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *