NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వినాయక నిమజ్జన వేడుకల్లో లడ్డూ వేలం..రూ.23 వేలకు దక్కించుకున్న సుంకన్న

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని పోతుదొడ్డి గ్రామంలో పెద్దమ్మతల్లి వినాయక యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి పట్టువస్త్రాలు ,ధూప ,దీప నైవేద్యాలు సమర్పించారు.వినాయక నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలం పాటలో నక్కన్న సుంకన్న రూ.23,000లకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *