శ్రీశ్రీశ్రీ దశభుజ లక్ష్మీ గణపతి ఆలయ ఆధ్వర్యం లో గణేష్ నిమజ్జన కార్యక్రమం
1 min read
సిరికి శ్రీనివాస్,దశ సంధ్య దంపతులచే సుమారు 200 మందికి అన్నదాన కార్యక్రమం
పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు నిమజ్జన కార్యక్రమం విజయవంతం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: శ్రీశ్రీశ్రీ దశభుజ లక్ష్మీ గణపతి దేవాలయంలో రెండవ వార్షికోత్సవం సందర్భంగా మూడవ రోజు గణేష్ నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆదర్శనగర్ దస్తాశ్రమం రోడ్ నెంబర్ 2 లో సిరికి శ్రీనివాస్, దశ సంధ్య దంపతులు బుధవారం సుమారు 200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విచ్చేసిన భక్తులు శ్రీశ్రీశ్రీ లక్ష్మీ గణపతి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఈ నిమజ్జన కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


