NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు అరుదైన గౌరవం…

1 min read

లీడ్‌వే పీస్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ – నైజీరియా సంస్థ గ్లోబల్ హెడ్ ఆఫ్ స్పెషల్ డ్యూటీస్‌గా అంబాసిడర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఎంపిక

కర్నూలు, న్యూస్​ నేడు:  అంతర్జాతీయ స్థాయిలో శాంతి, మానవ హక్కులు, సామాజిక సేవ మరియు మానవతా విలువల పరిరక్షణకు కృషి చేస్తున్న లీడ్‌వే పీస్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్, నైజీరియా సంస్థలో గ్లోబల్ హెడ్ ఆఫ్ స్పెషల్ డ్యూటీస్ గా అంబాసిడర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ నేడు ఆ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ అంతర్జాల కార్యక్రమం లో ఎంపికైనట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. మానవ హక్కుల పరిరక్షణ, శాంతి స్థాపన, సామాజిక న్యాయం, పేదలు మరియు బలహీన వర్గాలకు సేవలు అందించడం వంటి కార్యక్రమాల్లో ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఈ బాధ్యతను అప్పగించినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి సందేశాన్ని విస్తరించడం, మానవ హక్కులపై అవగాహన కల్పించడం, అవసరమైన వారికి సహాయ సహకారాలు అందించడం, వివిధ దేశాల్లో సేవా కార్యక్రమాలను సమన్వయం చేయడం వంటి బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు. ఈ అంతర్జాతీయ బాధ్యత తనపై ఉంచిన విశ్వాసానికి ప్రతీకగా భావిస్తున్నానని, మానవతా సేవకు మరింత అంకితభావంతో పనిచేస్తానని అంబాసిడర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *