NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రమాదవశాత్తు  కాలువలో పడి వ్యక్తి మృతి

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ:  పత్తికొండ వద్ద హంద్రీ కాలువలో ప్రమాదవశాత్తు పడి వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం నాడు చోటుచేసుకుంది. పత్తికొండ పట్నానికి చెందిన సురేష్ 48 సం.లు పూజకు వాడిన పూలను కాలువలు పారవేయడానికి వెళ్ళగా కాలుజారి కాలువలోని నీటిలోకి పడిపోయాడు. ఈత రాకపోవడంతో ఉధృతంగా పారుతున్న నీటిలో మునిగి మృతి చెందాడు. చుట్టుపక్కల వాళ్ళు గమనించి కాలువలో పడిన వ్యక్తిని రక్షించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కుటుంబ యజమాని మరణించడంతో భార్య, పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. మృతునికి ఒక కుమారుడు కుమార్తె భార్య ఉన్నారు. ప్రమాద ఘటన తెలుసుకున్న పోలీసులు శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *