NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

25 న  ఉచిత అల్బెందజోల్ మాత్రలు పింపిణీకి చర్యలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖధికారి డాక్టర్.కామేశ్వరరావు తో స్టేట్ అబ్సర్వర్స్ డాక్టర్.ప్రసన్న కుమార్  మరియు రామచంద్రుడు  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ  సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖధికారి  మాట్లాడుతూ     ఈ నెల 25 న నిర్వహించబోయే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా  జిల్లాలోని అన్ని ప్రభుత్వ’ప్రైవేటు కళాశాలలు,పాతశాలలు,వసతి గృహాలు,అంగన్వాడి కేంద్రాల్లో 1-19 ఏళ్ళ వయస్సు బాలలకు,కిశోరబాలికలకు పిల్లలందరికీ ఉచితంగా అల్బెందజోల్ మాత్రలు  ఇవ్వడం జరుగుతుందని తెలిపారు,జిలాల్లో ఒకటి నుండి 19 సంవత్సరముల వయస్సు కలిగిన పిల్లకు  6 లక్షల 41 వేల  154 అల్బెండజోల్ మాత్రలు వేయడానికి అన్ని ఏర్పాట్లు  పకడ్బందిగా ఏర్పాటు చేశామని తెలిపారు.ఈ నులిపురుగుల సంక్రమణ,నిర్మూలన పట్ల విద్యార్థులకు,తల్లితండ్రులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.     అంగన్వాడి కేంద్రాలు,పాతశాలలు,కళాశాలలో ఒకటి నుంచి 19 ఏళ్ళ లోపు పిల్లలందరికీ మాత్రలను ఈ నెల 25 న ఒకే రోజు   చప్పరించి నమిలి మింగించడం  జరుగుతుందని తెలిపారు. రాష్ట్రీయ బాల స్వస్త్యా కార్యక్రమం అధికారి డాక్టర్.మహేశ్వర ప్రసాద్  మాట్లాడుతూ ,   సెప్టంబర్  25 న  మాత్రలు తీసుకోకుండా మిగిలిన  పిల్లలకు అక్టోబర్ 5వ    ఈ మాత్రలు  ఇవ్వడము  జరుగుతుందని తెలిపారు. 

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *