ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి 25వ వార్షిక పవిత్రోత్సవాలు
1 min read
ముఖ్య అతిథులుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య,మీనా దంపతులు
ఆలయ కమిటీ చైర్మన్ పాలడుగు వెంకట రమాదేవి ఆధ్వర్యంలో ఉత్సవాలు
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు ఆర్ఆర్ పేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 25వ వార్షిక పవిత్రోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ చైర్మన్ పాలడుగు వెంకట రమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఆయన సతీమణి మీన హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు కిలాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు వేద ఆశీర్వచనాలతో ఎమ్మెల్యే దంపతులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ పవిత్రోత్సవాలు ఆలయ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహించడం అభినందనీయమన్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని, సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. పవిత్రోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ చేస్తున్న ఏర్పాట్లను ఆయన అభినందించారు.పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, వేదపారాయణం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించడంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఈవో నలారి సతీష్ కుమార్,ధర్మకర్తల మండలి సభ్యులు ఈతకోట శ్రీనివాసరావు, నంగులూరు సత్యనారాయణ, బొత్స మధు, గోకా నెహ్రూ బాబు, కె.వి. సీతారామాంజనేయ శర్మ, సువ్వాడ పద్మావతి, చౌటుపల్లి తులసి, డొక్కు రమాదేవి, గుమ్మడి లక్ష్మి గణేశ్వరి, రంభ అనసూయ, డివిజన్ ఇంచార్జ్ పిల్లారిశెట్టి సంధ్య తదితరులు పాల్గొన్నారు.



