ఆలూరు నియోజకవర్గ సమస్యలపై మంత్రి తో ఈడిగ గోవింద్ గౌడ్ భేటీ
1 min read
రెవెన్యూ, భూ సమస్యలు, అభివృద్ధి అంశాలపై సానుకూల చర్చ
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి
మంత్రి ఛాంబర్‌లో ఆప్యాయంగా పలకరించిన అనగాని సత్యప్రసాద్
హొళగుంద న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈడిగ గోవింద్ గౌడ్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను మంత్రి ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై మంత్రితో సానుకూలంగా చర్చించారు.ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈడిగ గోవింద్ గౌడ్‌ను ఎంతో ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలూరు నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను గోవింద్ గౌడ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాలు, భూ సమస్యలు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి అవసరాలు తదితర అంశాలపై వివరించారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు, అర్హులైన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రెవెన్యూ సేవలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సమస్యలను పరిశీలించి పరిష్కరించే విధంగా అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ఈడిగ గోవింద్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత కల్పించాలని కోరారు.మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కలిసిన ఈడిగ రాజేంద్ర గౌడ్అనంతరం టీడీపీ యువ నాయకులు ఈడిగ రాజేంద్ర గౌడ్ కూడా మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను మంత్రి ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి అభివాదం చేశారు. ఈ సందర్భంగా మంత్రి రాజేంద్ర గౌడ్‌ను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఆలూరు నియోజకవర్గ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పించడం, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయడం తమ ప్రధాన లక్ష్యమని ఈడిగ గోవింద్ గౌడ్, ఈడిగ రాజేంద్ర గౌడ్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకుల మధ్య సమన్వయంతో ముందుకు సాగుతామని తెలిపారు.


