NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు

1 min read

గత 24 సంవత్సరాలుగా నిర్విరామంగా  ఉత్సవ కార్యక్రమాలు

సుమారు 350 మందికి అన్న ప్రసాద వితరణ

 పెద్ద ఎత్తున విచ్చేసిన జిల్లా గృహ నిర్మాణ శాఖ ఉద్యోగులు,సిబ్బంది భక్తులు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా గృహ నిర్మాణ సంస్థ ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో శ్రీ వినాయక చవితి మహోత్సవాలు గత 24 సంవత్సరాల నుండి గృహ శాఖ సిబంది నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా బుధవారం సుమారు 350 మందికి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి. సత్యనారాయణ (పిడి) లడ్డు పాట నిర్వహించగా ఉంగుటూరు డిఇ శేఖర్ స్వామివారి లడ్డును దక్కించుకున్నారు. స్వామివారి ప్రసాదాన్ని సిబ్బందికి, భక్తులకు అందించారు. తుఫాన్ ప్రభావాన్ని అధిగమించి ఈ వినాయక చవితి ఉత్సవాలను గృహ నిర్మాణ శాఖ ఉద్యోగులు, సిబ్బంది నిర్వహించడం పలువురు చెప్పుకోదగ్గ విషయంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెంఇఇ ,ఉంగుటూరు. పోలవరం డిఇ లు, మేనేజర్ టి. కనకరాజు, జిల్లా హెడ్ కోటర్ డిఇ జి.రామకృష్ణ  మరియు గృహ నిర్మాణ శాఖ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని  జై జై గణేష  నినాదాలతో ఊరేగింపుగా బయలుదేరి ఏలూరు కృష్ణ కాలువలో నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు..

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *