ఉపాధి హామీ పని దినాలు 200 రోజులు పెంచాలి
1 min read
వేతనం 700₹ ఇవ్వాలి
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
ఆదోని, న్యూస్ టుడే: ఎల్ నినో ప్రభావంతో సరైన సమయంలో వర్షాలు లేక ఆదోని మండలం లో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో వ్యవసాయ కూలీలకు ఉపాధి పనులు డిమాండ్ పెరిగిందని, ఉపాధి పనులు తక్షణమే 200 రోజులకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న డిమాండ్ చేశారు.గురువారం పాండవగల్ గ్రామంలో ఉపాధి పనులు జరుగుతున్న పని ప్రదేశంలో ఆయన మాట్లాడుతూసాధారణంగా డిసెంబర్, జనవరిలో కూలీలు ఉపాధి పనులకు డిమాండ్ ఉంటుంది. కానీ ఈ కరువు ప్రభావంతో కూలీలకు చేయడానికి పనులు దొరకడం లేదని, ఆగస్టు చివరివారం నుండి కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారని,కూలీలకు ఉపాధి పని దినాలు 125 రోజులు కొద్ది రోజులలో పూర్తి అవుతాయని తక్షణమే 200 రోజులు పని దినాలు కల్పించాలని, వేతనం 700 రూపాయలు ఇవ్వాలని, తక్షణమే పెండింగ్లో ఉన్న ఉపాధి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే వ్యవసాయ కూలీలకు ప్రజా పంపిణీ ద్వారా నిత్యవసర సరుకులు చౌక ధరలకు అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అక్టోబర్ నెలలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు గోవిందు, గ్రామ నాయకులు కృష్ణ, నర్సిరెడ్డి, హుస్సేనీ, తాయన్న, ఉపాధి హామీ మేటీలు హనుమంత్ రెడ్డి అనంత శివరాములు మరియు పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు.


