NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రత్యేక శ్రద్ధతో ప్రజా సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారాలు చూపుతూ వస్తున్నాం

1 min read

జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రత్యేక శ్రద్ధతో ప్రజా సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారాలు చూపుతూ వస్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఒకపక్క ప్రజా అవసరాలను గుర్తిస్తూనే, మరోపక్క అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సమప్రాధాన్యతనిస్తూ వస్తోన్న విధానాలను ఆయన వివరించారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సావధానంగా తెలుసుకున్నారు. వారికి భరోసా కల్పించి,అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా అర్భన్‌ ఛాలెంజింగ్‌ ఫండ్‌ ద్వారా వచ్చే డిసెంబర్‌ నాటికి రహదారుల నిర్మాణం నూరు శాతం పూర్తికానుందని వెల్లడించారు. ఇక కొత్త పెన్షన్ల మంజూరునకు సైతం అంతే ప్రాధాన్యతతో ముందుకెళ్తున్నామని పేర్కొన్న ఎమ్మెల్యే బడేటి చంటి దరఖాస్తుల స్వీకరణ నుంచి అర్హుల ఎంపిక వరకూ అంతటా పారదర్శక విధానాలే కొనసాగుతున్నాయని చెప్పారు. మరోపక్క అర్హులకు ఇళ్ళ మంజూరునకు సైతం అదేవిధమైన ప్రత్యేక దృష్టిసారించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇదేసమయంలో ఒక మహిళకు తోపుడు బండిని ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసి ఛైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author