NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వర్షాకాలంలో అంటూ వ్యాధులు ప్రభలే అవకాశం ఉంది

1 min read

కలుషితమైన నీరు త్రాగడం వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం వలన టైఫాయిడ్ ఇతర వైరల్ ఫీవర్ సంభవిస్తాయి

అసిస్టెంట్ మలేరియా అధికారి జే.గోవిందరావు సూచన

 ఫ్రైడే డ్రై డే ఆచరించాలని,  కరపత్రాలు ఇంటింటికి పంపిణీ చేసి ర్యాలీ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల అంటూ వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని ముక్యంగా  ప్రజలు ఎక్కువగా టైఫాయిడ్ జ్వరాలు మరియు ఇతర అంటు వ్యాధులుతో బాధపడతారని దీనికి కారణము కలుషితమైన నీరు త్రాగడం వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం వలన టైఫాయిడ్ మరియు ఇతర వైరల్ ఫీవర్ సంభవిస్తాయని అసిస్టెంట్ మలేరియా అధికారి జే గోవిందరావు సూచించారు  స్థానిక ఏలూరు పట్టణ శ్రీరామ్ నగర్ 8వ రోడ్ లో ఫ్రై డే, డ్రై డే కార్యక్రమం లో ప్రజలతో మాట్లాడుతూ వర్షాకాలంలో సాధారణంగా జ్వరాలు, వాంతులు,విరోచనాలు కామెర్లు,టైఫాయిడ్ మొదలు అంటువ్యాధులతో ప్రజలు బాధపడతారని  కొన్ని జ్వరాలు దోమ కుట్టడం వల్ల సంక్రమిస్తాయని కొన్ని జ్వరాలు కలుషితమైన నీరు కలుషితమైన  ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా  వ్యక్తిగత పరిశుభ్రత లోపము వల్ల సంభవిస్తాయని దోమలు కుట్టడం వల్ల డెంగు, మలేరియా, చికెన్ గునియా వ్యక్తిగత పరిశుబ్రత లోపించడం వల్ల టైఫాయిడ్ నీళ్ల విరోచనాలు కామెర్లు మొదలగు వ్యాధులు తో బాధపడతారని కాబట్టి ప్రజలు దోమలు పెరగకుండా వారానికి ఒకసారి నీళ్ల తొట్టెలు, డ్రమ్ములు, మొదలగు వాటిని కడిగి మూతలు పెట్టుకోవాలని ఇంటి పరిసరాలు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు అలాగే కాచి చల్ల ర్చిన  నీటినే తాగాలని, రోడ్డు ప్రక్కన మూతలు లేని ఆహార పదార్థాలు తినరాదని వేడి వేడి ఆహార పదార్థాలను తినాలని సూచించారు, వారానికి ఒకసారి ఫ్రైడే డ్రై డే ఆచరించాలని,  కరపత్రాలు ఇంటింటికి పంపిణీ చేసి ర్యాలీ నిర్వహించారు హెల్త్ అసిస్టెంట్ మేక శ్రీనివాసరావు, రాజు ,ఆరోగ్య కార్యకర్తలు, నాగమణి, మార్త ఆశా కార్యకర్తలు శాంతి మల్లిక, లావణ్య అంగన్వాడీ కార్యకర్త నర్సమాంబ పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About Author